close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సత్తువ తాగేద్దాం

వేసవి ఎండల నుంచి బయట పడాలంటే ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారా.. వంటింట్లో అందుబాటులో ఉండే పుట్నాల పప్పుతో చక్కని పానీయం తయారుచేయొచ్చు. నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ పానీయం తక్షణ శక్తినిస్తుంది.
కావాల్సినవి: పుట్నాల పప్పు - కప్పు, చక్కెర - రెండు పెద్ద చెంచాలు, నీళ్లు మూడు కప్పులు.
తయారీ: వేయించిన పుట్నాల పప్పును పిండి చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.  చిటికెడు ఉప్పు, చక్కెర వేసి మరోసారి బాగా కలపాలి. అరముక్క నిమ్మరసం పిండాలి. చివరగా పుదీనా వేసుకుని తాగితే సరి. ఈ షర్బత్‌ నుంచి మాంసకృత్తులు, పీచు, ఖనిజాలు అందుతాయి. చలవ చేస్తుంది కూడా.


మరిన్ని