close

ఫీచర్ పేజీలు

ఎంచక్కా బంతాట...

ఫ్రెండ్స్‌.. బాగున్నారా?! ఈ రోజు మనం బంతులతో భలే ఆట నేర్చుకుందాం! పైగా ఇది ఇంట్లోనే ఆడుకోవచ్చు. పెద్దగా స్థలమూ అవసరం లేదు. మరి ఎలాగో తెలుసుకుందామా?
* ఈ ఆట ఆడాలంటే మన దగ్గర ఏవైనా అయిదు రంగుల ప్లాస్టిక్‌ బంతులుండాలి.
* కనీసం.. రంగుకో అయిదు బంతులైనా ఉండాలి.
* ఓ అయిదు బుట్టలూ కావాలి.
* మన దగ్గర ఉన్న బంతుల రంగులకు సంబంధించిన కాగితాలను బుట్టలకు అతికించాలి.
* ఒకవేళ రంగుల కాగితాలు మన దగ్గర లేకున్నా ఫరవాలేదు. తెల్ల కాగితం మీదైనా ఆ రంగు పేరు రాసి బుట్టకు అతికిస్తే సరి.
* ఇదంతా పూర్తైన తర్వాత చిత్రంలో చూపించినట్లు అయిదు బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.
* బంతులన్నీ ఓ సంచీలో వేసుకుని మన పక్కనే పెట్టుకోవాలి.
* బుట్టలకు ఓ అయిదు అడుగుల దూరంలో మనం నిల్చోవాలి.
* ఇప్పుడు ఒక్కో బంతిని తీసుకోవాలి. ఆయా రంగుల బంతులను వాటికి కేటాయించిన బుట్టల్లోకి విసరాలి.
* ఒకేసారి రెండు చేతుల్లోకి రెండు బంతులను తీసుకునీ ప్రయత్నించొచ్చు.
* ఎన్ని బంతులు సరిగ్గా విసరగలిగితే మనకు అన్ని పాయింట్లు వచ్చినట్లు.


ప్రయోజనం:

* సునిశిత పరిశీలన పెరుగుతుంది.

* మెదడు, కంటి, చేతి సమన్వయం మెరుగవుతుంది.

* ఏకాగ్రత పెరుగుతుంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు