close

తాజా వార్తలు

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

తిరుపతిలో ప్రయాణికుల ద్వారా వైరస్‌ సోకకుండా ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ వినూత్నంగా ఆలోచన చేశాడు. ప్రయాణికులకు, డ్రైవర్‌ క్యాబిన్‌కు మధ్య అడ్డుగా ఓ ప్లాస్టిక్‌ పరదా కట్టాడు.


టోల్‌గేట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ అమల్లో కొన్ని సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ బాహ్యవలయ రహదారి టోల్‌గేట్‌ వద్ద ప్రతి 10 వాహనాల్లో 2, 3 వాహనాల ఫాస్ట్‌ట్యాగ్‌ స్టిక్కర్లను స్కానర్లు గుర్తించడం లేదు. దీంతో టోల్‌గేట్‌ సిబ్బంది వాహనంపైకి ఎక్కి ఇలా స్కాన్ చేయాల్సి వస్తోంది.


రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకునేందుకు హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీసు వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యం.


తిరుమల శ్రీవారి ప్రసాదం ధరలను తగ్గిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. దీంతో తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్‌ వద్ద భక్తులు బారులు తీరారు. 


సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాకు రైళ్లు తిరుగుతున్నాయనే సమాచారంతో వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చారు. రైల్వే సిబ్బంది ఇక్కడి నుంచి రైళ్లు లేవని తిప్పి పంపించారు. దీంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో రైల్వే స్టేషన్‌ ఆవరణలోని ఫుట్‌పాత్‌పై పడిగాపులు కాస్తున్నారు. 


సాధారణంగా మనకు పుచ్చకాయలంటే ఆకుపచ్చగా ఉంటాయనే తెలుసు. ఇప్పుడు ఇవి పసుపు రంగులోనూ లభిస్తున్నాయి. హైబ్రీడ్‌ రకానికి చెందిన ఈ పుచ్చకాయలను హైదరాబాద్‌ పాతబస్తీలోని శాలిబండలో కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. 


హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌లో శుక్రవారం ఓ ఇంటి గోడ మీద గింజలు తింటున్న ఉడుత పక్కన కాకి వచ్చి వాలింది. ఉడుతను పట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని గ్రహించిన ఉడుత క్షణాల్లోనే కాకి నుంచి తప్పించుకుని పారిపోయింది. 


ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌లో గంగా నది ఒడ్డున బురదను శరీరానికి పూసుకుంటున్న యువకులు.


చలన చిత్ర షూటింగ్‌ కోసం జోర్డాన్‌ వెళ్లిన మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ ఎట్టకేలకు సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపి నేపథ్యంలో అన్ని విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో పృథ్వీరాజ్‌ అక్కడ చిక్కుకుపోయారు. అయితే, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా శుక్రవారం ఆయన కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు