close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. నాణ్యమైన వైద్యం కోసమే బస్తీ దవాఖానాలు

పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలు అండగా నిలుస్తాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీటి ఏర్పాటుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. నాణ్యమైన ప్రాథమిక వైద్యం కోసమే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మే నెల పూర్తి వేతనాలు చెల్లించండి

2. షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ నెలకుగాను ఉద్యోగులకు 90 శాతం వేతనాన్ని చెల్లించాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రాబడి లేని కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆక్స్‌ఫర్డ్‌ టీకా మరో అడుగు ముందుకు..!

కరోనావైరస్‌కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ తయారు చేస్తున్న  ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. తొలిదశలో 1,000 మందికి ఇమ్యూనైజేషన్‌ చేసినట్లు పేర్కొంది. వారి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో దశలో 10,260 మందిపై దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 56 ఏళ్లు పైబడిన వారు, 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రోజుకు లక్ష టెస్టులు: ఐసీఎంఆర్

5. చైనా సొమ్ముతో జాగ్రత్త..!

చైనా, హాంకాంగ్‌లను దృష్టిలో పెట్టుకొని భారత్‌ కొత్తగా ఫారెన్‌పోర్టు ఫోలియోలపై  దృష్టిపెట్టింది. వీటిని కూడా పరిశీలించేలా సరికొత్త నిబంధనలను తయారు చేసిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. భారత్‌తో భూభాగంపై సరిహద్దులు పంచుకొనే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలను పరిశీలించాలన్న నిర్ణయం వచ్చిన కొన్ని వారాలకే ఎఫ్‌పీఐలపై  కూడా దృష్టిపెట్టడం గమనార్హం. అప్పట్లో భారత్‌ కంపెనీలను విదేశీ టేకోవర్ల నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 50వేల తాత్కాలిక నియామకాలు: అమెజాన్‌!

భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0లో కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. షాపింగ్‌ మాల్స్‌ తెరిచేందుకు మాత్రం అనుమతి లేదు. దీంతో గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌ షాపింగుకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 50వేల మంది తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్రంప్‌..మీరు మాస్క్‌ ఎందుకు ధరించరు?

ఓవైపు అమెరికాలో కరోనా వైరస్‌ విలయం సృష్టిస్తున్నా.. తాను మాత్రం మాస్క్‌ ధరించనని గతంలో చెప్పిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కొద్దిసేపు దాన్ని ముఖానికి వేసుకోవాల్సి వచ్చింది.  ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సందర్శనలో భాగంగా ఆయన కొద్దిసేపు ముఖాన్ని మాస్క్‌తో కవర్‌ చేసుకున్నారు. కరోనా వైరస్‌ సోకకుండా ఉద్యోగులందరూ తప్పకుండా మాస్క్‌ ధరించాలని ఆ కంపెనీ నిబంధన పెట్టింది. దీంతో ఆయన కొద్దిసేపు మాత్రమే ధరించి.. ఆతర్వాత  మాస్క్‌ను పక్కనపెట్టేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓ రోజంతా ఆలోచించి ఆమెకు ఫోన్‌ చేశా: రానా

మిహికా బజాజ్‌కు ప్రపోజ్‌ చేయడం, ఆమె గురించి ఇంట్లో చెప్పడం.. అంతా చాలా సింపుల్‌గా జరిగిపోయిందని కథానాయకుడు రానా చెప్పారు. గత కొన్ని రోజులుగా మంచు లక్ష్మి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ పేరుతో ఆమె లైవ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రానాతో మాట్లాడారు. మిహిక, లాక్‌డౌన్‌లో కాలక్షేపం గురించి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య సంభాషణను చూడండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ మార్పులు చేయబోతున్నారా?

9. టీమ్‌ఇండియా పర్యటనపై హామీ ఇవ్వలేదు

ఆగస్టులో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన గురించి హామీ ఇవ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ అన్నారు. అవకాశాలపై చర్చలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు. పర్యటనకు బీసీసీఐ అంగీకరించిందన్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం ప్రకటనతో ఆయన విభేదించారు. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం సీఈవో జాక్వెస్‌ ఫాల్‌, డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధుమాల్‌ అంగీకరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌లో గంగా నది ఒడ్డున బురదను శరీరానికి పూసుకుంటున్న యువకులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు