close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అవి వేధిస్తుంటే ఇవి...

జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు కాస్త అల్లం టీ తాగితే రిలాక్స్‌ అయిపోవచ్చు. మరి తలనొప్పి వేధిస్తే? ఒత్తిడి చుట్టుముడితే? ఇదిగో ఈ రకమైన ఆహారాన్ని ప్రయత్నించండి.

ఒత్తిడి ఉంటే: అరటిపండు, స్ట్రాబెర్రీ వంటివి తింటే అదుపులో ఉంటుంది.

కుంగుబాటులో ఉన్నవారికి: క్యారెట్‌, యాపిల్‌, పాలకూర, బీట్‌రూట్‌ మంచివి.
ఆర్థరైటిస్‌ ఉంటే: క్యారెట్‌, పైనాపిల్‌, నిమ్మ ఉపశమనం ఇస్తాయి.
కంటిచూపు కోసం: క్యారెట్‌, ఆకుకూరలు మేలు చేస్తాయి.

ఆస్తమా ఉంటే: క్యారెట్‌, పాలకూర, యాపిల్‌, వెల్లుల్లి, నిమ్మ వంటివి తినొచ్చు.


తలనొప్పి వేధిస్తుంటే: యాపిల్‌, దోసె, అల్లం వంటివి తీసుకోవాల్సి ఉంటుంది.



అజీర్తి ఇబ్బంది పెడుతుంటే: పైనాపిల్‌, క్యారెట్‌, నిమ్మ, పుదీనా వంటివి ఉపశమనం కలిగిస్తాయి.


మలబద్ధకం: క్యారెట్‌, యాపిల్‌, క్యాబేజీ.
అధిక రక్తపోటు: బీట్‌రూట్‌, యాపిల్‌, దోస, అల్లం.
అల్సర్‌: క్యాబేజీ, క్యారెట్‌.



అలసట బాధిస్తుంటే: క్యారెట్‌, బీట్‌రూట్‌, గ్రీన్‌ యాపిల్‌, నిమ్మ, పాలకూర ఉపకరిస్తాయి.


 


మరిన్ని