close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
టిఫానీ తుపాను!

టిఫానీ అరియానా వార్తల్లోకి వచ్చింది...ఇంతకీ ఎవరీమె? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు...నల్లజాతీయుల ఆందోళనలు అణచడానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్‌ హెచ్చరిస్తుంటే.. వారికి మద్దతు పలికి తండ్రిని సవాలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ట్రంప్‌కి దూరంగా: ట్రంప్‌ రెండో భార్య మార్లా మాపుల్స్‌ ద్వారా కలిగిన సంతానం టిఫానీ. తోబుట్టువులు ఇవాంకా, ఎరిక్‌, ట్రంప్‌ జూనియర్‌లా.. ప్రచారం కోరుకోదు. 1999లో అమ్మానాన్నలు విడిపోయాక తల్లితో కలిసి ఉంటోంది. ‘అందరి తండ్రుల్లా మా డాడీ నన్ను బీచ్‌కి తీసుకెళ్లలేదు. నాతో సరదాగా ఆడుకోలేదు. ఆయనతో నాకు పెద్దగా అనుబంధం లేదు. అయినా ఆయనో స్ఫూర్తిదాయక వ్యక్తి’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
కెరీర్‌: టిఫానీ చిన్నప్పుడే మ్యూజిక్‌ పాఠాలు నేర్చుకుంది. పదిహేడేళ్లు ఉన్నప్పుడే ‘లైక్‌ ఏ బర్డ్‌’ పేరుతో సొంతంగా ఆల్బమ్‌ విడుదల చేసింది. ఓఫ్రా విన్‌ఫ్రే ప్రఖ్యాత షో ‘వేర్‌ ఆర్‌ దే నౌ’లో స్వయంగా పాడింది.
సాదాసీదాగా: అధికార దర్పం ప్రదర్శించదు. అమెరికాలో అత్యంత ముఖ్యమైన ‘రిపబ్లికన్‌ కన్వెన్షన్‌’లో కుటుంబంతో కలిసి పాల్గొన్నప్పుడు సాదాసీదా వస్త్రధారణతో హాజరైంది.
సొంత వ్యక్తిత్వం: టిఫానీది ముక్కుసూటి వ్యక్తిత్వం. తండ్రి రిపబ్లికన్‌ అయితే ఆమె బోయ్‌ఫ్రెండ్‌ రాస్‌ మెకానిక్‌ డెమోక్రాట్‌. ఆమె అభిప్రాయాలు సైతం స్వేచ్ఛగా వెల్లడిస్తుంది. పోలీసుల అదుపులో ప్రాణాలు కోల్పోయిన ఫ్లాయిడ్‌ మరణాన్ని నిరసిస్తూ నల్లజాతీయులు అమెరికా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైన ఈ వ్యవహారాన్ని ట్రంప్‌ ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నిస్తుంటే టిఫానీ వారికి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.


మరిన్ని