close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గడువు దాటితే గండమే

మన్నుతున్నాయి కదాని ఏళ్ల తరబడి వాడితే ఆ వస్తువులతో ముప్పే అంటున్నారు నిపుణులు. అసలు అవేంటి? వాటిని ఎప్పటికి మార్చాలి?
లో దుస్తులు: వీటికి చెమట ఎక్కువ పడుతుంది. ఆరునెలలు దాటితే వాటి రంగు, ఆకృతీ దెబ్బతింటాయి. మన శరీరం సైజులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అవన్నీ గమనించుకోకుండా వాడుతుంటే...వెన్ను, భుజాలు, నడుం నొప్పి ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు, తీవ్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు.
దువ్వెనలు: జుట్టు అంటే శ్రద్ధ ఉన్నా... వీటిని శుభ్రం చేసే ఆసక్తి మాత్రం చాలామందికి ఉండదు. కానీ ఇవి అపరిశుభ్రంగా ఉంటే చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లు మాడుపై దాడి చేయొచ్చు. జుట్టు బలహీనపడి రాలడం, తెగడం వంటివి జరుగుతాయి. అందుకే వీటిని గోరువెచ్చని నీళ్లు, షాంపూతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి గాలికి ఆరనివ్వాలి. తడిగా ఉన్నవాటిని వాడొద్దు.  వీటిని ఏడాదికి మించి వాడకపోవడమే మంచిది.
మేకప్‌ సామగ్రి:  మనం రోజూ వాడే షాంపూ, పౌడర్‌, ఐబ్రోపెన్సిల్‌, లిప్‌బామ్‌...ఇలా ఏ సౌందర్య ఉత్పత్తిని అయినా సరే గడువు తేదీ ముగిశాక అస్సలు వాడొద్దు. పొరబాటున వాడితే...అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఇతరులవి వినియోగించడం, వాటిని నిర్లక్ష్యంగా పడేయడం...వంటివీ చేయకూడదు.


మరిన్ని