close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కళాపోషకులేనా?

జరసోచో!

ఇప్పుడు ఏది మాట్లాడినా.. దేని గురించి ఆలోచించినా.. రెండే విషయాలు.. * కరోనా ముందు.. ●* కరోనా తర్వాత..

అంతలా అందరి జీవితాల్లోనూ చెరగని ముద్ర వేసింది. మరి, మీ సంగతేంటి? లాక్‌డౌన్‌ కాలం మొత్తంలో రొటీన్‌కి భిన్నంగా ఏం చేశారు? ‘ఏముందీ.. నచ్చిన సినిమాలు.. వెబ్‌ సిరీస్‌లు.. అన్నీ చూసేశా.. గదిని నచ్చినట్టు సర్దుకున్నా.. పుస్తకాలు చదివా..’ అంటూ చిట్టా విప్పేస్తారు. కానీ, ఇవన్నీ అందరూ చేసేవే. అంతకు మించి.. మీకు ‘బ్రేక్‌’ ఇచ్చేవి ఇంకేం చేశారు? ఆలోచనలో పడ్డారా? ఇప్పటికయినా మించి పోయిందేం లేదు. ఇంటిపట్టున దొరికిన కాస్త సమయాన్ని మీకు ‘బ్రేక్‌’ ఇచ్చే వాటిపై వెచ్చించండి. ఉదాహరణకు... మీరో మంచి ప్రోగ్రామర్‌.. దాంతో పాటు చిన్న చిన్న కవితలు, కథలు రాసే రచయిత అయితే.. వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఎక్కడైనా తీరిక దొరికితే మీ రైటింగ్‌ స్కిల్‌ని పెంచుకోండి. ఓ నవల రాయడం ప్రారంభించండి... ఎవరికి తెలుసు మీరు రాసిన నవల మీకో మంచి ‘బ్రేక్‌’ ఇవ్వొచ్చేమో! మిమ్మల్ని ఓ ‘యంగ్‌ రైటర్‌’గా ప్రపంచానికి పరిచయం చేయొచ్చేమో! గుర్తుంచుకోండి.. ఇకపై ప్రొఫెషనల్‌గా ఎదగడంతో పాటు వ్యక్తిగా మీకంటూ ఓ కళని అభివృద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం.. ప్రొఫెషన్‌తో పాటు ప్రత్యామ్నాయ ప్రతిభ ఉంటేనే భవిష్యత్తు భరోసాగా సాగుతుంది.

కమ్యూనిటీలతో కలవండి..

స్కిల్‌ ఏదైనా మరింత సాన పట్టేందుకు నెట్టింట్లో కమ్యూనిటీల సాయం తీసుకోవచ్ఛు ఉదాహరణకు మీకు ఫొటోగ్రఫీ ఇష్టం అయితే అందుకు తగిన ఆన్‌లైన్‌ కమ్యూనిటీలు ఏమున్నాయో వెతకొచ్ఛు దాంట్లో నెట్‌వర్క్‌గా ఏర్పడి ఫొటోగ్రఫీ టెక్నిక్స్‌ పెంచుకోవచ్ఛు ఇతరులు తీసిన ఫొటోలను చూసి అదే తరహాలో సాధన చేయొచ్ఛు లైవ్‌ సెషన్స్‌లో పాల్గొనొచ్ఛు ఫొటోగ్రఫీ రంగంలో చోటు చేసుకునే కొత్త ట్రెండ్స్‌ని ఫాలో అవ్వొచ్ఛు అలాగే, మీరు చదువుతో పాటు మోడలింగ్‌ రంగంలో మెలకువల్ని నేర్చుకోవాలనుకుంటే మీదైన స్టైలింగ్‌తో ప్రొఫైల్‌ని తయారు చేసుకోవచ్ఛు ఇన్‌స్టా లాంటి సోషల్‌ మీడియా వేదికల్ని వాడుకుని ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తూ సూచనల్ని కోరొచ్ఛు ఫాలోవర్స్‌ను పెంచుకుని మోడలింగ్‌లో అవకాశాల్ని పొందొచ్ఛు మరెందుకు ఆలస్యం.. మీదైన టాలెంట్‌తో ‘బ్రేక్‌’ కోసం ఎదురెళ్లండి.

వెతకండి.. ఏదో ఒకటి ఉంటుంది

ఎప్పుడో ఆటవిడుపు కోసం చేసేది ఏదైనా.. పాడడం.. పెయింటింగ్స్‌ వేయడం.. కవితలు రాయడం.. కథలు చెప్పడం.. ఇలా ఏదో ఒక కళ మీలో ఉంటుంది. ఇప్పుడు దానికి టైమ్‌ వచ్చింది. మీలో మంచి సింగర్‌ ఉన్నాడని అనిపిస్తే పాడండి. ఎవరో పాడినవే కాదు. మీవైన లిరిక్స్‌తో పాడే ప్రయత్నం చేయండి. నెట్టింట్లో అందుకు తగిన మ్యూజిక్‌ సర్వీసులూ ఎలాగూ ఉన్నాయి. వాడుకుంటూ సింగర్‌గా మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీలో మంచి కథకుడు ఉంటే.. ఏదో ఒక అంశాన్ని తీసుకుని కథ అల్లండి. ‘వర్చువల్‌ స్టోరీ టెల్లింగ్‌’ గ్రూపుని క్రియేట్‌ చేసి వినిపించండి. గ్రూపు సభ్యుల నుంచి సలహాలు, సూచనలు కోరండి. లేదంటే.. గ్రూపులో ఒకరు కథని ప్రారంభిస్తారు. కొంత కథ చెప్పాక మరొకరికి కథని పాస్‌ చేస్తారు. స్వీకరించిన వ్యక్తి కొనసాగించి.. ఇంకొకరికి పాస్‌ చేస్తారు.. ఇలా గ్రూపు సభ్యులంతా పలు రకాల ఇన్‌పుట్స్‌తో క్రియేటివ్‌గా కథల్ని సృష్టించొచ్ఛు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు