close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహిళల కోసం ‘సంఘమిత్ర’: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌: మహిళల కోసం ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని సైబరాబాద్‌ పోలీసులు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా సీపీ సజ్జనార్‌, అక్కినేని అమల, నమ్రత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కరోనా వల్ల మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల మహిళలు గృహ హింస, సైబర్‌ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి సాయం చేసేందుకే ‘సంఘమిత్ర’ కార్యక్రమం ప్రారంభించామని సీజీ సజ్జనార్‌ వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు