close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకలి లేదంటున్నాడు...

మా బాబుకి పదేళ్లు. ఎప్పుడు అన్నం తినమన్నా ఆకలి లేదంటాడు. బాగా బలహీనమయ్యాడు. ఏదీ ఇష్టంగా తినడు. వాడికి ఆకలి పెరగడానికి ఏం చేయాలి?

- సుకన్య, అహమ్మదాబాద్

పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం లేదంటే చిరుతిళ్లు ప్రధాన కారణం కావొచ్చు. అవి బిస్కెట్లు, చాక్లెట్లు లేదా ఫాస్ట్‌ఫుడ్స్‌. ఇలాంటి అలవాట్లు లేనప్పుడు కూడా ఆకలి లేకపోతే కడుపులో నులిపురుగులు కారణం కావొచ్చు. పరిశీలించి, అదే కారణమైతే మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాయామం లేకపోయినా ఆకలి వేయదు. అలసిపోయేట్టు ఆడుకున్నప్పుడే వారికి ఆకలి వేస్తుంది. రోజూ ఓ సమయానికి ఆహారం తీసుకునే అలవాటు చేయాలి. ఆహారం ఎదుగుదలకు ఉపయోగపడి ఆరోగ్యాన్ని అందిస్తుందనీ, భవిష్యత్తులో అనుకున్నవన్నీ సాధించడానికి తోడ్పడుతుందనీ పిల్లలకు చెప్పాలి. తినడానికి ఆసక్తి కలిగేలా రకరకాల పదార్థాలు తయారుచేసి పెట్టాలి.
వంటింటి వైద్యం... పిప్పళ్లని నేతిలో దోరగా వేయించి చల్లార్చి మెత్తని చూర్ణంలా చేయాలి. దీన్ని పల్చని వస్త్రంలో జల్లించి భద్రపరుచుకోవాలి. పిల్లల వయసుబట్టి అయిదు చిటికెలు లేదా అర చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని అందులో నెయ్యి, తేనె కలిపి రెండు పూటలా నాకించాలి. ఇందులో నెయ్యి ఎక్కువ, తేనె తక్కువగా కలపాలి. 160 గ్రా. పిప్పళ్ల చూర్ణం, 50గ్రా. దాల్చిన చెక్క చూర్ణం, 200 గ్రా. చక్కెర, 5 గ్రా. యాలకుల చూర్ణం, 400 మి.లీ. పాలు, 5 గ్రా. నాగకేసరాల చూర్ణం తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిక్కబడే వరకు ఉడికించి చివర్లో 50 గ్రా. నెయ్యి కలిపి చల్లారాక 50 గ్రా.తేనె కలపాలి. ఈ లేహ్యాన్ని రోజూ చెంచా పరిమాణంలో పిల్లలతో తినిపించాలి. ఇది వారిలో ఆకలిని పుట్టిస్తుంది. నులిపురుగులు పోయేలా చేస్తుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు