close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా

ప్రముఖ కథా నాయకుడు రాజశేఖర్‌ కుటుంబం కరోనా బారిన పడింది. ఆయనతో పాటు ఆయన భార్య జీవిత, ఇద్దరు పిల్లలు శివాని, శివాత్మికలు కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని రాజశేఖర్‌ శనివారం ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘నాకు, నా భార్య జీవిత.. మా ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మేం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. పిల్లలిద్దరూ కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డారు. జీవిత, నేను.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటాం’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు రాజశేఖర్‌.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు