close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రవి హోరు.. చిత్ర జోరు

కథానాయకుడు రవితేజ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న ‘క్రాక్‌’ తుది దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి మరో కొత్త కబురు అందింది. ఆయన తన తర్వాతి సినిమాని దర్శకుడు రమేష్‌ వర్మతో చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం సామాజిక  మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ ఆదివారమే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సందర్భంగా ఉదయం 11:55 గంటలకు చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలియజేసింది. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ   ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. దీనికి ‘కిలాడీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మాత.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు