close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభాస్‌ కానుక 23న

కథానాయకుడు ప్రభాస్‌ నుంచి సినీప్రియులకు, ఆయన అభిమానులకు ఓ చక్కటి కానుక అందనుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. 70ల కాలం నాటి యూరోప్‌ నేపథ్యంగా సాగే ఓ చక్కటి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఇటలీలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈనెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి తొలి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ఈ ప్రచార చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు