close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా టీకా పంపిణీకి సమాయత్తమవుదాం

  ప్రతి ఒక్కరికీ సత్వరం అందేలా చూడాలి
  సమీక్ష సమావేశంలో  ప్రధాని మోదీ సూచన

దిల్లీ: ప్రతి పౌరుడికి కొవిడ్‌-19 టీకా సత్వరం అందేలా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు, లేదా ఎన్నికలు వంటివి నిర్వహించాల్సి వచ్చినప్పుడు అన్ని స్థాయుల్లో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఎలా స్పందిస్తాయో అలాంటి తరహాలోనే సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితులు, టీకా అందజేతకు సన్నద్ధతపై శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. టీకా వచ్చాక దానిని పంపిణీ చేయాల్సిన విధానం గురించి సూచనలు చేశారు. సువిశాల దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా అందేందుకు ఏమేం చేయాల్సి ఉంటుందో చర్చించారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం నుంచి, టీకా వేయడానికి అవసరమైన సూదుల కొనుగోలు వరకు ప్రతి దశపైనా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.  రోజువారీ కేసులు, వృద్ధిరేటు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన చెప్పారు. అయినా ఉదాసీనతకు తావివ్వకుండా వైరస్‌కు కళ్లెం వేసే చర్యల్ని కొనసాగించాల్సిందేనని తెలిపారు.
మూడు టీకాలు సిద్ధమవుతున్నాయి..
సమావేశానంతరం ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనాపై దేశంలో మూడు టీకాలు మంచి పురోగమన స్థాయిలో ఉన్నాయని, వీటిలో ఒకటి మూడో దశ ప్రయోగాల దశను చేరుకుందని తెలిపింది. కరోనా వైరస్‌.. జన్యుపరంగా స్థిరంగా ఉందని, ప్రధానమైన మార్పులకు గురికాలేదని దేశవ్యాప్త అధ్యయనాల్లో వెల్లడైనట్లు వివరించింది. అందువల్ల టీకా పనితీరుపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు