close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
8 లక్షల కంటే దిగువకు..

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా క్రియాశీల (యాక్టివ్‌) కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత తొలిసారిగా వీటి సంఖ్య 8 లక్షల కంటే దిగువకు రావడం కొంత ఊరట. వరుసగా 14వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం 24 గంటల్లో 62,212 కొత్త కేసులు బయటపడ్డాయి.. 70,816 మంది కోలుకున్నారు. 837 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం కేసుల సంఖ్య 74 లక్షలు దాటగా.. కోలుకున్నవారి(రికవరీ) సంఖ్య 65 లక్షలు దాటింది. దేశంలో గత 6 రోజులుగా.. కేసులు 68 వేల లోపు, మరణాలు 900 లోపు నమోదవుతున్నాయి.
క్రియాశీల కేసుల సంఖ్య శనివారానికి 7,95,087కి చేరింది. మొత్తం కేసుల్లో వీటి శాతం 10.70కి తగ్గడం ఊరట. ఈ నెల ప్రారంభంలో ఇది 14.9%గా ఉంది. రికవరీ రేటు ఈనెల 1 నాటికి 83.53% ఉండగా అది తాజాగా 87.78%కి పెరిగింది. మరణాల రేటు శనివారం నాటికి 1.52 శాతంగా నమోదైంది.
కర్ణాటక, కేరళల్లో కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. పశ్చిమబెంగాల్‌, మణిపుర్‌లలో మాత్రం గత 24 గంటల్లో ఇదివరకటి కంటే అధిక కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. 24 గంటల్లో ఎక్కువ మరణాలు సంభవించిన మొదటి 3 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక,  పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు