close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆరంభం

ఈనాడు, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు శనివారం ఆరంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9గంటల నుంచి భక్తులను అనుమతించారు. నేడు బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దర్శనాల కోసం ఉచిత, రూ.100, రూ.300 టిక్కెట్లను రోజుకు పదివేల చొప్పున ముందుగానే ఆన్‌లైన్‌లో జారీ చేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు