close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరమ్మతులకు జాప్యం తప్పదా?

  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లో 51 మీటర్లు చేరిన నీరు
  మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై ప్రభావం

ఈనాడు డిజిటల్‌ నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే, కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ఎత్తపోతల పథకంలోని పంపుహౌస్‌ పునరుద్ధరణకు చాలాకాలం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఇది నీట మునిగిన విషయం విదితమే. పంపుహౌస్‌ 68 మీటర్ల ఎత్తు ఉండగా.. 51 మీటర్ల ఎత్తు వరకు తిరుగు జలాలు చేరాయి. దీంతో మరమ్మతులు చేపట్టడం సవాల్‌గా మారింది. శనివారం మరమ్మతులు ప్రారంభించగా, వాటిని పూర్తి చేసి ఎత్తిపోతలను పునరుద్ధరించేందుకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.ప్రాజెక్టు సిబ్బంది, లిఫ్ట్‌ నిర్వహణ చేసే పటేల్‌ కంపెనీ సిబ్బంది మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పంపుహౌస్‌లో నీళ్ల తోడివేతకు పైపులు, మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకంలో పంపులు మునిగిపోవడం ఇది రెండోసారి. మొదటిసారి 2014లో కృష్ణానదికి భారీగా వచ్చిన వరదలతో ఇవి నీట మునిగాయి.
భగీరథ నీటి సరఫరాకు అంతరాయం
నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు ఇక్కడి నుంచే మిషన్‌ భగీరథ తాగునీటిని అందిస్తున్నారు. ఎల్లూరు జలాశయం సామర్థ్యం 0.35 టీఎంసీˆలు. శనివారం నాటికి 0.20 టీఎంసీˆల నీరు అందుబాటులో ఉంది. 6 జిల్లాల్లోని 3,600 గ్రామాలు, 19 పురపాలికలకు తాగునీటి సరఫరాకు ప్రతి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం ఉన్న నీటిని 10 నుంచి 15 రోజుల వరకు వాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత తాగునీటి సరఫరా ఎలా అన్న ప్రశ్న అధికారుల్లో ఉత్పన్నమవుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు