close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైదరాబాద్‌ గజగజ

ఈనాడు, హైదరాబాద్‌: జోరువాన హైదరాబాద్‌ను  మరోసారి ముంచెత్తింది. క్యుములోనింబస్‌ మేఘాలు నగరంపై ఆవరించినందున ఉరుములు, మెరుపులతో శనివారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో బండ్లగూడలో వాన మొదలైన మూడు గంటల్లో 12సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వరదనీటితో కాలనీలు, బస్తీలు, రోడ్లు నిండా మునిగాయి. రెండ్రోజులుగా శాంతించిన చెరువులకు మళ్లీ వరద పోటెత్తింది. వాటి దిగువనున్న కాలనీలు, బస్తీలు ప్రమాదంలో పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మెహిదీపట్నం, అత్తాపూర్‌, ఆరాంఘర్‌ చౌరస్తా, చాంద్రాయణగుట్ట రోడ్లపై నడుములోతున నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ద్విచక్రవాహనాలు ప్రవాహంలో చిక్కుకుపోయి వాహనదారులు కిందపడిపోయారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు నరకయాతన అనుభవించారు. మలక్‌పేట యశోదా ఆస్పత్రి సమీపంలో ఒకరు, అరుంధతినగర్‌లో కంచెలేని విద్యుత్తు నియంత్రిక వద్ద మరో బాలుడు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు