close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎమ్మెల్యే ఇంటికే రక్షణ లేకపోతే ఎలా?

 ఫ్రెండ్లీ పోలీసు పేరుతో చేతులు కట్టేసిన ప్రభుత్వం  
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు చేపట్టిన ధర్నా సందర్భంగా తన ఇంటిపై శుక్రవారం దాడి జరగడాన్ని ఖండిస్తున్నానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రైతుల ముసుగులో భాజపా, కాంగ్రెస్‌ నాయకులు దాడికి యత్నించారన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విద్యాసాగర్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వాళ్ల చేతులు కట్టేసిందని, రాళ్లు విసిరినా పోలీసులు ఆపలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే ఇంటికే రక్షణ లేకపోతే ప్రజలను ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. పోలీసులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించి, తప్పు జరిగితే శిక్షించే అధికారం ఇవ్వాలన్నారు.  మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్రప్రభుత్వం చేపడుతుందని, కేంద్రం ప్రకటించిన ధరను బట్టి.. రాష్ట్రం మద్దతు ధర ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. కొనుగోళ్లకు.. ఎమ్మెల్యేకు ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు