close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మింగేసిన మంచు చరియలు

  దేశ సరిహద్దులో సైనికుడి మృత్యువాత
  కాగజ్‌నగర్‌లో విషాదం!

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: మరో ఆరునెలల్లో పదవీ విరమణ ఉంది. ఇక ఇంటికొచ్చేసి మీతోనే ఉంటా.. అంటూ సంతోషంగా కుటుంబ సభ్యులతో చెప్పిన ఆ జవాను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నిరంతరం దేశరక్షణలో నిమగ్నమైన ఆ సిపాయి మంచు చరియలు విరిగి పడి మృత్యువాత పడ్డారు. ఇప్పటికే పదవీకాలం పూర్తయినా.. దేశసేవపై మక్కువతో మరో అయిదేళ్లు తన సర్వీసును పొడిగించుకున్నారు. అలాంటి జవాను మరణించడం పలువురిని విషాదంలోకి నెట్టింది. లద్దాఖ్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్న కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ నివాసి షాకిర్‌ హుస్సేన్‌(38) విధులు ముగించుకొని బేస్‌ క్యాంపునకు తిరిగి వస్తుండగా, ఒక్కసారిగా మంచు చరియలు విరిగి పడ్డాయి. హుస్సేన్‌తో పాటు కొందరు సహచరులు మృత్యువాత పడినట్లు తెలిసింది. ఈ ఘటన శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఆర్మీ ఉన్నతాధికారులు బాధిత కుటుంబానికి మధ్యాహ్నం సమాచారం అందించారు. కాగజ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌-జంశిత్‌ సుల్తానా దంపతుల మొదటి కుమారుడు షాకిర్‌ హుస్సేన్‌. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూ 2001లో సైన్యంలో చేరారు. 2016లో పదవీ విరమణ పొందినా, మరో అయిదేళ్లు సైన్యంలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. 2021 ఫిబ్రవరిలో పదవీ విరమణ ఉంది. ఈలోగా ఈ ఘోరం జరిగిపోయింది. ప్రమాదం విషయం తెలియగానే హుస్సేన్‌ ఇల్లంతా రోదనలతో నిండిపోయింది. బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు విశ్రాంత సైనికులు జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహం కాగజ్‌నగర్‌కు ఎప్పడు వస్తుందో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. షాకిర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు