close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యవసాయ చట్టాలతో రైతుల ఆయువుపట్టుపై దాడి

కేంద్రంపై రాహుల్‌గాంధీ ధ్వజం

చండీగఢ్‌: కేంద్రం ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఆయువుపట్టుపై కఠోరంగా దాడి చేస్తాయని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రైతులు, రైతు కూలీల చెమట, రక్తాన్ని పీల్చేలా ఆ చట్టాలు ఉన్నాయని, దేశ పునాదులనే బలహీనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టిన ‘స్మార్ట్‌ విలేజ్‌ క్యాంపెయిన్‌’ రెండో దశ ప్రారంభోత్సవంలో శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. నూతన చట్టాలతో రైతులకు జరిగే నష్టాలను చర్చించేందుకు పంజాబ్‌లో ఈనెల 19న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల పంజాబ్‌, హరియాణాలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీల్లో రైతులు, కూలీలను నేరుగా కలిశానని, కేంద్రం చట్టాలు తమకు హాని చేస్తాయన్న అవగాహన అందరికీ ఉందని రాహుల్‌ చెప్పారు. రైతులు బలహీనం అయితే దేశ పునాదులే కదిలిపోతాయన్నారు. గ్రామ పంచాయతీలతో, ప్రజలతో మాట్లాడకుండా పైస్థాయి నుంచి అమలుచేసే పథకాలు దేశాన్ని బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలు నిజంగా రైతులకు మేలు చేసేవే అయితే.. వీటిపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు