close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీసీ విద్యార్థులందరికీ బోధన రుసుములివ్వాలి

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బోధన రుసుములు పొందేందుకు ఎంసెట్‌లో పదివేల వరకు ర్యాంకు వరకు వచ్చిన వారే అర్హులనే నిబంధనను సడలించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరే ర్యాంకులతో సంబంధం లేకుండా వెనుకబడిన తరగతుల విద్యార్థులందరికీ పథకాన్ని అమలు చేయాలన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదాయ పరిమితిపై ఆంక్షల వల్ల పేద కుటుంబాల వారు నష్టపోతున్నారని తెలిపారు. ఆదివారం నుంచి ఇంజినీరింగు కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగు జరగనున్నందున బీసీ విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు