close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చంపుతామని బెదిరింపులు

దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేన్‌ కార్యదర్శి ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను వ్యతిరేకిస్తూ ఈనెల 14న దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేయడంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆ సంస్థ గౌరవ కార్యదర్శి అభిజిత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు ఆయన శనివారం దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ‘‘ఈనెల 15న ఉదయం నేను నా కార్యాలయంలో పని చేసుకుంటూ ఉండగా  ఫోన్‌కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను యునైటెడ్‌ కింగ్‌డం ఇండియన్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా పరిచయం చేసుకున్నాడు. ఈనెల 14న బార్‌ అసోసియేషన్‌ చేసిన తీర్మానంలో పాలుపంచుకోవడాన్ని ప్రశ్నించారు. అది నా వ్యక్తిగత నిర్ణయంకాదని, బార్‌ అసోసియేషన్‌ నిర్ణయమని చెప్పేలోపే హిందీలో దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇంటి నుంచి జాగ్రత్తగా బయటికెళ్లు. పెద్దపెద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించాడు. అలాంటి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహిత్‌ మాథుర్‌, కోశాధికారి మోహిత్‌గుప్తలకూ వచ్చాయి.వీటిని తీవ్ర నేరంగా పరిగణించి ఐపీసీ కింద శిక్షించే అవకాశముంది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని తక్షణం దర్యాప్తు చేపట్టాలని’’ దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ గౌరవకార్యదర్శి అభిజిత్‌దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు విన్నవించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు