close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి

ఆల్‌ ఇండియా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి ఆల్‌ ఇండియా బార్‌ అసోసియేషన్‌ విన్నవించింది. జగన్‌మోహన్‌రెడ్డి లేఖ న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందని అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదీష్‌ సి.అగర్వాల్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అవినీతి, మనీలాండరింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి... న్యాయమూర్తులను బెదిరించి, తనకు అనుకూల ఉత్తర్వులు వెలువడేలా చూసుకోవడానికి, అవాంఛనీయ పద్ధతుల్లో న్యాయస్థానాల విధులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నట్లు బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు కూడా అయిన అగర్వాల్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి తన లేఖలో వినిపించిన స్వరం, ఆపాదించిన ఉద్దేశాలు, దాన్ని ప్రయోగించిన సమయాన్నిబట్టి ఆయన... రహస్య అజెండా స్పష్టంగా తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఖండన
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను లక్ష్యంగా చేసుకొని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి... సీజేఐ బోబ్డేకి రాసినలేఖను బహిరంగంగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఖండించింది. ఈమేరకు తీర్మానం చేసినట్లు ఆ సంస్థ తాత్కాలిక గౌరవ కార్యదర్శి రోహిత్‌పాండే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు