close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కాచి వడగట్టిన నీటినే ప్రజలు తాగాలి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల సూచన

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలు, వరదల నేపథ్యంలో కాలనుగుణంగా(సీజనల్‌) వచ్చే జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఈ సమయంలో నీరు, ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన శనివారమిక్కడ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావుతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటల ఆదేశించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు