close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

మృతులది ఒకే కుటుంబం

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరులో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు గోవిందు వేణుగోపాల్‌రావు (54), హేమలత(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వేణుగోపాల్‌రావు తల్లి బుజ్జమ్మ (71) కూడా వీరితోనే ఉంటున్నారు. అనంతపురంలో పరీక్ష ఉండటంతో పిల్లలిద్దరూ వెళ్లారు. శనివారం సాయంత్రం కొరియర్‌ వచ్చిందని డెలివరీ బాయ్‌ ఇంటికి వచ్చాడు. వస్తువు తీసుకునేందుకు బయటకు వచ్చిన వేణుగోపాల్‌రావుపై ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్తు తీగ తెగి పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. భయపడిన కొరియర్‌ బాయ్‌ అక్కడి నుంచి వెనక్కి వెళ్లి కేకలు వేశాడు. దీంతో బయటకు వచ్చిన బుజ్జమ్మ.. కుమారుడిని తాకగా అక్కడికక్కడే పడిపోయింది. ఇద్దరూ విగతజీవులుగా మారడంతో స్థానికులు కేకలు వేశారు. ఇంట్లో ఉన్న హేమలత వచ్చి భర్త, అత్తమ్మపై ఉన్న విద్యుత్తు తీగను లాగేందుకు యత్నించగా ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు