close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటకానికి ప్రోత్సాహం

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు    రాష్ట్ర పర్యాటకశాఖ చర్యలు
కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకూ ప్రయత్నం

ఈనాడు-హైదరాబాద్‌: మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలు పెంచడం ద్వారా రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో కొన్నింటికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ప్రధాన పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంతో పాటు, పాలమూరు తిరుపతిగా పేరొందిన మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటితోపాటు ఒక వైపు ఆహ్లాదం, మరోవైపు సాహసక్రీడలకు నెలవైన మహబూబ్‌నగర్‌లోని మయూరి ఎకోటూరిజం పార్కులు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక్కడ రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేసి భక్తులు, పర్యాటకులకు వసతి సహా వివిధరకాల సదుపాయాలు కల్పించాలన్నది పర్యాటకశాఖ ప్రణాళిక. దీనిలోభాగంగా యాదాద్రిలో రూ.50 కోట్లతో, మహబూబ్‌నగర్‌లో ఆలయం, ఎకో టూరిజంపార్కుకు కలిపి మరో రూ.50 కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మహబూబ్‌నగర్‌కు 16 కి.మీ. దూరంలో ఉంది. 200 ఎకరాల విస్తీర్ణంలోని ఎకోటూరిజంపార్కులో చిన్నారుల ఉద్యానవనం, యోగా కేంద్రంతో పాటు పలు సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు