close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతివృష్టి మిగిల్చిన మనోవేదన

యువ రైతు ఆత్మహత్య

కారేపల్లి, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టించినా పంట మంచి దిగుబడి వస్తే అప్పులు తీర్చి సంతోషంగా ఉండాలనుకుంది ఓ యువరైతు కుటుంబం. కానీ ఇటీవల కురిసిన అతి వర్షాలు ఆ ఇంట అలజడి సృష్టించాయి. పంట నష్టపోయి శుక్రవారం రాత్రి ఆ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లాల్‌తండాకు చెందిన బానోతు సురేశ్‌ (30) తనకున్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాల్లో మిరప సాగు చేశారు. వ్యవసాయం చేస్తూనే ఖమ్మం మిరప మార్కెట్‌ యార్డులో కూలి పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదకు మిరప సగం మేర కొట్టుకుపోగా మరికొంత ఇసుకతో నిండిపోయింది. కాయ పగిలిన పత్తిలో మొలకలు వచ్చాయి. ఈ ఏడాది సాగు కోసం రూ.1.6 లక్షలు అప్పు చేశారు. పంట నష్టంతో మనోవేదనకు గురైన సురేశ్‌ ఇంట్లో పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంలోనే మృతి చెందారు. ఆయనకు భార్య మమత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు