close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు ఏమన్నారు


మహిళలను గౌరవించడం అమ్మవారి పూజ వంటిదే...

అత్యాచారాలను నియంత్రించడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు ఘోరంగా విఫలమైంది. హాథ్రస్‌ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు సరికదా... వాస్తవాలను తొక్కిపెడుతూ నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అమ్మవారి పూజ ఎంత ముఖ్యమో, మహిళలను గౌరవించడమూ అంతే ముఖ్యం.

- రాహుల్‌గాంధీ



డ్రాగన్‌కు ఘాటు సమాధానం చెప్పాల్సింది

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌... యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని భారత సరిహద్దుల వద్దనున్న డ్రాగన్‌ దళాలకు బహిరంగంగానే సూచించారు. దీనిపై మన ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం! ‘‘అవును. మీ వాళ్లను అడ్డంగానైనా, నిలువుగానైనా ఇంటికి పంపడానికి వేచి చూస్తున్నాం. ఎలా పంపాలో మీరే నిర్ణయించుకోండి’’ అని ఘాటుగా చెప్పి ఉండాల్సింది.

- సుబ్రమణ్య స్వామి


మోదీ హయాంలో భారత్‌ స్థానం దిగజారుతోంది

మోదీ సర్కారు మరో ఘనత సాధించింది! ఆరేళ్లుగా ముఖ్యమైన ప్రపంచ సూచీల్లో భారత్‌ స్థానం దిగజారుతూనే ఉంది. చాలా అంశాల్లో పొరుగు దేశాల కంటే మనం బాగా వెనక్కి వెళ్లిపోయాం. తాజాగా ‘అంతర్జాల స్వేచ్ఛ-2020’ ర్యాంకింగ్‌లో భారత్‌ చివరిలోనే నిలిచింది.

- సీతారాం ఏచూరి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు