close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అధికారులకు శిక్షణ కోసం ఐఐటీ-దిల్లీ, డీఆర్‌డీవోతో సీఆర్‌పీఎఫ్‌ ఒప్పందం

దిల్లీ: కేంద్ర రిజర్వు పోలీసు బలగం (సీఆర్‌పీఎఫ్‌).. తన అధికారులను సాంకేతికంగా సుశిక్షితులను చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శనివారం.. ఐఐటీ-దిల్లీ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌లో వివిధ ఇంజినీరింగ్‌ డిగ్రీ కలిగిన అధికారులు 500 మంది ఉన్నారు. అవగాహనా ఒప్పందం ప్రకారం.. వీరందరికీ దశలవారీగా స్వల్పకాలిక ప్రత్యేక కోర్సుల్లో ఐఐటీ-దిల్లీ, డీఆర్‌డీవో శిక్షణ ఇవ్వనున్నాయి. ఇలా శిక్షణ పొందిన వారు ఐఐటీ- దిల్లీలో ఉన్నత కోర్సులు చేస్తారు. తర్వాత వీరంతా డీఆర్‌డీవోతో కలిసి రక్షణ రంగ పరిశోధనల్లో పాలుపంచుకుంటారు. తొలి బ్యాచ్‌ అధికారులు.. బాలిస్టిక్స్‌, నిర్మాణ, మౌలిక సదుపాయాలు, ఐటీ సాంకేతికత అంశాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు