close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేరళలో 432 మంది వైద్యసిబ్బంది తొలగింపు

 ఏళ్ల తరబడి సెలవులో ఉన్నందుకే...

తిరువనంతపురం: ఏళ్లతరబడి అనధికార సెలవులో కొనసాగుతున్న 432 మంది వైద్య సిబ్బందిని కేరళ ప్రభుత్వం సర్వీసుల నుంచి తొలగించింది. వీరిలో 385 మంది డాక్టర్లు ఉన్నారని ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పలుమార్లు అవకాశాలిచ్చినా మళ్లీ విధుల్లో చేరుతామంటూ సిబ్బంది నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో వారందరినీ డిస్మిస్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. ఇంతకుమునుపూ ఇలాగే విధుకు హాజరుకాని 36 మంది డాక్టర్లను, 20 మంది నర్సులు, అయిదుగురు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లను సర్వీసుల నుచి తొలగించినట్టు గుర్తుచేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు