close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ద్వైపాక్షిక సంబంధాలపై జైశంకర్‌ వ్యాఖ్యలు అవాంఛనీయం

 పాక్‌ స్పందన

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలను పాక్‌ ఖండించింది. శుక్రవారం ఒక వర్చువల్‌ సదస్సులో జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉగ్రవాదాన్ని ఒక విధానంగా పాక్‌ బహిరంగంగానే అంగీకరిస్తోంది. పైగా దీన్ని సమర్థించుకుంటోంది. అందువల్ల ఆ దేశంతో సాధారణ సంబంధాలను కొనసాగించడం చాలా కష్టం’’ అని పేర్కొన్నారు. దీనిపై పాక్‌ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ‘‘రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి పూర్తిగా పాక్‌ కారణమంటూ చేసిన అవాంఛనీయ, వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’’ అని పేర్కొంది. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు