close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మేం దిల్లీకి పోతాం..!

 భద్రత కోసమేనంటున్న హాథ్రస్‌ బాధితురాలి కుటుంబం

హాథ్రస్‌:  తమకు స్వగ్రామంలో భద్రత కరవయిందని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హాథ్రస్‌ బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగా దిల్లీ వెళ్లేందుకు సిద్ధమయింది. అక్కడే తమ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఈ మేరకు బాధితురాలి సోదరుడు విలేకరులతో శనివారం చెప్పారు. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దిల్లీ లేదా ముంబయికి బదిలీ చేయాలని బాధితురాలి కుటుంబం కోరుతోందని వారి తరఫున వాదిస్తున్న న్యాయవాది సీమా కుష్వాహ అలహాబాద్‌ హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని.. వారి భద్రతా వ్యవహారాల ఇంఛార్జి అంజలి గంగ్వార్‌ శనివారం కలిసి బాగోగులు తెలుసుకున్నారు. పొలానికి వెళ్లడానికి బాధితురాలి తండ్రి అనుమతి కోరగా.. పోలీసు భద్రతతో వెళ్లేందుకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు