close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెబ్ ఆప్షన్లపై కొనసాగుతున్న గందరగోళం

హైదరాబాద్: ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని షెడ్యూల్లో వెల్లడించారు. ఇవాళ ఉదయం మొదలు కావాల్సిన ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కొత్త కోర్సులకు ఎన్ఓసీలు ఇస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటికి సంబంధించిన తుది అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనుమతుల ప్రక్రియ పూర్తయిన తరువాత కళాశాలలు, సీట్ల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయాన్ని వెబ్‌సైట్‌ ద్వారా లేదా అధికారిక ప్రకటన ద్వారా ఎంసెట్ అధికారులు వెల్లడించకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం కొనసాగుతోంది.
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు