close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జీవ పోషిత గంగాదేవి

మస్త ప్రాణులను పోషించడం అనేది విష్ణువు పని అంటాం, కానీ విష్ణువు ఆ పని తాను చేయడంలేదు. తన పాదాల నుంచి పునర్జీవితురాలైన గంగాదేవితో చేయిస్తున్నాడు. జీవుల దేహాలలో 90 శాతం జలం ఉంటుంది. అది ఎవరో కాదు పోషక మాత అయిన గంగాదేవి. ఈ గంగ వివిధ రూపాల్లో జీవుల దేహాల్లో చేరుతోంది. ఇంతటి మహత్తర కార్యాన్ని కొన్ని కోట్ల యుగాలుగా గంగ అలుపు-సొలుపూ లేకుండా నిర్వర్తిస్తూ అటు దాహ బాధ ఇటు దేహ బాధ లేకుండా జీవులను సాకుతున్నది. అందుకే పంచ మహా భూతాలలో ఈమె(జలం) ప్రముఖంగా చేర్చబడింది. పాపులు తనలో విడిచిన పాపాలను... నిజమైన భక్తులు తనలో స్నానం చేయడంవల్ల పోగొట్టుకొంటున్న గంగ... అలా నిత్య శుభ్రత కలిగిన దేవతగా మనగలుగుతోంది. పత్రం-పుష్పం-ఫలం-తోయం... అంటూ భక్తిలో సైతం గంగకు ప్రముఖ స్థానం ఇచ్చారు. తోయం అంటే కన్నీటి రూపంలోని గంగ అని అర్థం. భక్తి పారవశ్యంలో ఎవరు భగవానుడి గొప్పదనం అనుభవిస్తూ కంటతడి పెడతారో దాన్నే తోయం అన్నారు. అయిదువేల దివ్య దేవ సంవత్సరాలు గడిచిన తరువాత గంగ భూమి పైన ఉండదని బ్రహ్మ వైవర్తనం చెప్పడంలోని రహస్యం ఏమంటే... అప్పటికి ప్రళయ కాలం వస్తుంది. ప్రళయంలో జీవులు ఉండవు కనుక గంగ కూడా తిరిగి విష్ణువు పాదాలలోకి చేరిపోతుంది. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కాగానే తిరిగి జీవుల పోషణకు అంటే, తన విధులకు హాజరవుతుంది. గంగ సర్వ జలాలకూ తల్లి వంటిది. నదులు ఎన్ని ఉన్నా, వాటిలో గంగకు ప్రత్యేక స్థానం ఇచ్చింది, వచ్చింది ఇందుకే.

- చల్లా జయదేవ్‌

* ఒత్తిడిని చిత్తుచేసే ముద్రలు..!
* మీ ఇంట్లో ఫెల్ట్‌ సబ్బు ఉందా?
ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం

https://epaper.eenadu.net లో


మరిన్ని