close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆటో అక్క!

బీఏ ఫిలాసఫీ

రాజీఅక్క...  ఆటోఅక్క ఈ పేరు చెబితే చెన్నై మహిళలకు ఓ భరోసా. ఆటో నడిపే రాజీని అక్కడి మహిళలు కేవలం ఆటోడ్రైవర్‌గా మాత్రమే చూడరు. అంతకుమించి ఓ ఆత్మీయురాలిగా భావిస్తారు. అందుకు కారణం... రాజీ చూపించే ఊదారతే. అర్ధరాత్రైనా సరే... ‘రాజీ అక్కా’ అని కాల్‌ చేస్తే చాలు వాళ్లకోసం నేనున్నానంటూ ఆటో వేసుకుని వెళ్తుంది రాజీ. ‘ఆఫీసు నుంచి లేటయ్యో, ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి వచ్చినప్పుడో ఒంటరి మహిళలకు ఎవరిని నమ్మాలో తెలియదు. అలాంటప్పుడు నాకు కాల్‌ చేస్తుంటారు. అవతలి వాళ్లు ఎంతో  అవసరం ఉంటే కానీ నాకు కాల్‌ చేయరు కదా. అందుకే ఏ సమయంలోనైనా వాళ్ల కోసం పరుగు పెడతా’ అంటుంది రాజీ. ఈమె బీఏ ఫిలాసఫీ చదువుకుంది. ఆటోడ్రైవర్‌ అశోక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో ఉపాధి కోసం అక్కౌంటెంట్‌గా పనిచేసినా తర్వాత ఆటో నేర్చుకుంది. 20 ఏళ్లుగా ఎంతోమంది అవసరంలో ఉన్న మహిళలకు ఉచితంగా ఆటోనడిపే రాజీ మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ఆటోడ్రైవర్‌గా తనకెదురయినా అనుభవాలని స్ఫూర్తి పాఠాలుగా చెబుతుంది.


మరిన్ని