close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ కురుపులుఏంటి?

నా వయసు 22 ఏళ్లు. వెజైనా దగ్గర సన్నటి కురుపుల్లా వచ్చాయి. ఇవి నొప్పి లేవు కానీ అప్పుడప్పుడు దురద పెడుతోంది. ఇదేమైనా అనారోగ్యమా? 

 - ఓ సోదరి

వెజైనా దగ్గర ఏమైనా కొత్తగా కురుపుల్లాంటివి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీకు వివాహమై దాంపత్య జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఇవి మొదలైతే మాత్రం ఇది ఏమైనా సుఖవ్యాధా...అనే దిశగా ఆలోచించాలి. ‘మొలస్కం కాంటాజియాసమ్‌’ అనే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ ద్వారా సంక్రమిస్తుంది. పెళ్లయిన తర్వాత వచ్చే కొన్ని రకాల సుఖవ్యాధుల్లో హెర్పిస్‌ ఒకటి. ఈ సమస్యలో దురదతోపాటు నొప్పీ ఉంటుంది. ‘నొప్పి లేదు కేవలం దురద మాత్రమే’నని రాశారు. కాబట్టి అది పాప్యూల్స్‌ లేదా మొలస్కం కాంటాజియాసమా అన్నది తెలుసుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఆ ప్రాంతంలో ఎపిడర్మల్‌ ఇన్‌క్లూజిన్‌ సిస్ట్స్‌ లాంటివి కూడా వృద్ధి చెందుతాయి.  కాబట్టి వీటిలో ఏవైనా కూడా కావొచ్చు. అవసరమైతే మీరు బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సమస్య ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ముందుగా మీరు గైనకాలజిస్ట్‌సు కలవండి.


మరిన్ని