close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ విత్తనాలు దాచేదెలా!

నాకున్న కొద్దిపాటి స్థలంలో నాటురకం కూరగాయలూ ఆకుకూరలూ పెంచుతున్నా. సేంద్రియ ఎరువులే వాడుతున్నా. కొందరు విత్తనాలు అడుగుతున్నారు. వారికోసం గతేడాది కొన్ని సేకరించి దాస్తే పుచ్చు పట్టేశాయి. విత్తనాల్ని తర్వాత ఏడాదికి దాచుకోవడం ఎలా?

-కవిత, రామగుండం

నాటు రకం కూరగాయలతో రుచితో పాటు పోషకాలూ పుష్కలంగా అందుతాయి. సేంద్రియ ఎరువుల వాడడంవల్ల రసాయనాల అవశేషాలూ ఉండవు. సాధారణంగా మిరప, టొమాటో, బెండ, వంగ, దోస, బీర విత్తనాల్లో పుచ్చు ఉండదు. కానీ తేమ పీల్చుకుని చెడిపోయే ప్రమాదం ఉంది. చిక్కుడు, బొబ్బర్ల విత్తనాలకు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. నిల్వ ఉంచిన పదిహేను రోజుల్లోనే పుచ్చు పురుగులు గుడ్లు పెట్టి రంధ్రాలు చేస్తాయి. దాంతో మొలకశాతం తగ్గిపోతుంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే... వీటిని భద్రపరుచుకోవడానికి ముందు కనీసం 2-3 రోజులపాటు నీడలో కనీసం రెండుగంటల పాటు ఆరబెట్టాలి. వాటిల్లో తేమ శాతం పది నుంచి పన్నెండుకి మించకుండా చూసుకోండి. ఇలా సిద్ధం చేసిన వాటిని వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేయొచ్చు. శుభ్రమైన గుడ్డ సంచుల్లో పెట్టి గాలి, తేమ చేరని డబ్బాల్లో మూత పెట్టి ఉంచొచ్చు. అలానే విత్తనాలకు బూడిద కలిపితే 6-10 నెలలు నిల్వ ఉంటాయి. వెదురు కర్రలకు మట్టి, పేడ మిశ్రమాన్ని పూత వేసి అందులో విత్తనాలను నిల్వ ఉంచుతారు. కిలో విత్తనాలకి 200 గ్రాముల ఉప్పు, పసుపు కలిపి విత్తనాలకు రాస్తే 6-8 నెలలు పుచ్చు రాకుండా కాపాడుకోవచ్చు.


మరిన్ని