close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మే ఆత్మీయ నేస్తం...


హారిక ప్రతి చిన్న విషయాన్నీ తల్లితో పంచుకుంటుంది. ఎప్పుడూ అమ్మ వెనకాలే తిరుగుతుంటుంది. అలాంటి ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రతిదానికీ అలిగి, గొడవపడుతుంది. ఇది చాలామంది ఇళ్లలో కనిపించే సమస్యే. ఇలాంటప్పుడు అమ్మగా మీరేం చేయాలంటే...
టీనేజ్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు ఒక్కసారిగా స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెడతారు. అన్నీ తమకు తెలిసినట్టుగా ప్రవర్తిస్తారు. ఇలాంటప్పుడు వాళ్లు పూర్తిగా తమ నియంత్రణ నుంచి వెళ్లిపోయారని బాధపడకూడదు. ఎదుగుదలలో ఇదీ భాగమేనని గుర్తించాలి.
* మీ ప్రేమాభిమానాలను ఎప్పటిలాగే టీనేజీ పిల్లల మీద చూపించాలి. రోజూ కాసేపైనా వాళ్లతో మాట్లాడుతుండాలి. వాళ్లు ఫలవంతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీ సూచనలు, సలహాలు ఎంతో అవసరమనే సంగతి గుర్తుంచుకోవాలి.
* పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయ్యారు కదా... ఇకనుంచి అన్ని విషయాలనూ వాళ్లే చూసుకుంటారని తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తూనే వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే వాళ్ల స్నేహితులతోనూ అప్పుడప్పుడూ మాట్లాడుతుండాలి. వాళ్ల ఫోన్‌ నంబర్లూ తీసుకుంటే అవసరమైనప్పుడు మాట్లాడే వీలుంటుంది.


మరిన్ని