close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పొట్ట తగ్గించే కెటిల్‌ బెల్‌!

అనారోగ్యకర ఆహారపుటలవాట్లు, మారిన జీవనశైలి, గంటల కొద్దీ కూర్చొని ఉండటం... ఈ కారణాలన్నింటితో పొట్ట దగ్గర కొవ్వు కొండలా పెరిగిపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటే చెమటా చిందించాల్సిందే. కనీసం రోజులో కొద్ది సమయమైనా పొట్ట తగ్గించే వ్యాయామాలను చేస్తే ఫలితం ఉంటుంది. అవేంటో మీరూ చూసేయండి...
కెటిల్‌ బెల్‌.. మొదట కాళ్లను ఎడంగా చాపి నిలబడాలి.  చేతులతో కెటిల్‌ బెల్‌ను పట్టుకోవాలి. ఇప్పుడు మోకాళ్లను మెల్లిగా వంచుతూ, తుంటి భాగాన్ని వెనక్కి లాగుతూ కిందికి వంగాలి.  ఈ సమయంలో కెటిల్‌ బెల్‌ను కాళ్ల మధ్యలో ముందుకు వెనక్కి కదల్చాలి. తిరిగి మామూలు స్థితికి వచ్చి కెటిల్‌ బెల్‌ను ఛాతీ వరకు తీసుకురావాలి. ఇలా రెండుమూడుసార్లు చేయాలి.
వి-అప్స్‌... నేలపై పడుకుని చేతులను తలకు ఇరువైపులా పెట్టుకోవాలి. పాదాలను ఒకదానికొకటి తాకేలా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్లను నిటారుగా ముందుకు చాపుతూ శరీరం పై భాగాన్ని లేపాలి. కాసేపు ఆ స్థితిలో ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి.


మరిన్ని