close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నడుము నొప్పితో బాధపడుతున్నా!

నాకిప్పుడు ఏడో నెల నడుస్తోంది. ఈ సమయంలో నడుము నొప్పితో బాధపడుతున్నా. ఇదేమైనా ఇబ్బందికి సంకేతమా? నేనెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  

-రాగిణి, హైదరాబాద్‌

ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో చాలారకాల మార్పులు జరుగుతాయి. ఈ టైమ్‌లో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్రావం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను మృదువుగా మారుస్తుంది. అంటే దీని ప్రభావం వల్ల వెన్నెముకలోని లిగమెంట్లన్నీ వదులుగా మారతాయి. అలాగే గర్భాశయంలో పిండం ఎదుగుతున్న కొద్దీ ఆ భారం పడటం వల్ల వెన్నెముక కొద్దిగా ముందుకు వంగుతుంది. ఎప్పుడైతే శరీర భారమంతా వదులుగా ఉండే వెన్నెముకపై పడుతుందో నడుము నొప్పి రావడమనేది గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణమే. అయితే విటమిన్‌-డి, కాల్షియం లోపం వల్ల కూడా ఈ నొప్పి రావొచ్చు. ఈ లోపం లేకుండా సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. అలాగే మొదటి మూడు నెలల తర్వాత వైద్యుల సూచనల మేరకు వెన్నెముక దృఢంగా ఉండటానికి తేలికపాటి యోగాసనాలు, వ్యాయామాలు చేయొచ్చు. అలాగే నొప్పి ఉన్న ప్రాంతంలో డాక్టర్లు సూచించిన మజిల్‌ రిలాక్సెంట్‌ జెల్స్‌, ఆయింట్‌మెంట్స్‌ రాసుకోవచ్చు. అలాగే ప్రసవం తర్వాత కొద్ది విరామం తీసుకుని వెన్నెముక బలంగా మారేందుకు వ్యాయామాలు చేయాలి.


మరిన్ని