close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం... అనారోగ్యమా?

నాకిప్పుడు అయిదో నెల. ఈమధ్య తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇదేమైనా అనారోగ్య సంకేతమా? - ఓ సోదరి
మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లడం ప్రెగ్నెన్సీ లక్షణాల్లో ఒకటి. గర్భధారణ సమయంలో హార్మోన్లలో కలిగే మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ప్రొజెస్టిరాన్‌, హ్యూమన్‌ క్రానిక్‌ గొనడోట్రోపిన్‌ (హెస్‌సీజీ) హార్మోన్లు.. మూత్రపిండాలకు రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. దాంతోపాటు నెలలు నిండుతున్న కొద్దీ మూత్రాశయంపై గర్భాశయ ఒత్తిడి క్రమంగా పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి, రెండో త్రైమాసికంలో కాస్త తగ్గినా.. తిరిగి మూడో త్రైమాసికంలో మళ్లీ పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పిండం ప్రసవానికి అనువుగా పెల్విస్‌ వైపునకు రావడమే కారణం. ఇవన్నీ సహజంగా జరిగే సాధారణ మార్పులే కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైతే కాఫీ తాగడం మానేయండి. అలాగే మూత్రానికి వెళ్లినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పరిస్థితిలో కొద్దిగా మార్పులు వస్తాయి. గర్భిణులు రోజుకు ఇన్నిసార్లు మూత్రానికి వెళ్లాలనేమీ ఉండదు.


మరిన్ని