
క్రీడలు
సింగపూర్: ఏటీపీ 250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే పరాజయం చవిచూశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3-6, 7-6 (7/3), 3-6తో టారో డానియల్ (జపాన్) చేతిలో ఓడాడు. సింగిల్స్‌లో ఓడినా.. డబుల్స్‌లో పూరవ్ రాజాతో కలిసి రామ్‌కుమార్ బరిలో ఉన్నాడు. డబుల్స్‌లోనే రోహన్ బోపన్న, జీవన్ నెడుంచెజియన్, శ్రీరాం బాలాజీ తమ భాగస్వాములతో పోటీపడనున్నారు. రెండేళ్ల విరామం తర్వాత తొలి ఏటీపీ టోర్నీ ఆడుతున్న యుకి బాంబ్రి.. సింగిల్స్ తొలి రౌండ్లో మాథ్యూ ఎబ్డెన్తో తలపడనున్నాడు.