
క్రీడలు
దిల్లీ: అడ్రియాటిక్ పెరల్ బాక్సింగ్ టోర్నమెంట్లో సనా చాను (51 కేజీలు), అరుంధతి (69 కేజీలు) స్వర్ణాలతో మెరిశారు. చాను.. ఫైనల్లో 3-2తో సబీనా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించగా, అరుంధతి 5-0తో మర్యానా (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. లక్కీ (64 కేజీలు) రజతం అందుకుంది. పది పతకాలతో (5 స్వర్ణ, 2 రజత, 2 కాంస్యాలు) మహిళల జట్టు అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో రెండు కాంస్యాలు కలిపి‡ 12 పతకాలతో భారత్ టోర్నీనిని రెండో స్థానంతో ముగించింది.