close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యాపిల్‌ బ్యూటీగా మారాలంటే...

ఆరోగ్యానికి యాపిల్‌ మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. దీంతో అందానికీ మెరుగులు దిద్దుకోవచ్చు. అదెలాగంటే...

చర్మం ఏదైనా: మీది జిడ్డు, పొడి, సాధారణ చర్మం.. ఏదైనా కావచ్చు. ఈ పూతను ప్రయత్నిస్తే ముఖం చక్కగా కాంతులీనుతుంది. చెంచా యాపిల్‌ గుజ్జులో అరచెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

మెరవాలంటే: రెండు చెంచాల యాపిల్‌ గుజ్జులో చెంచా చొప్పున దానిమ్మ రసం, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. బాగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్‌, యాంటీఏజింగ్‌ లక్షణాలు కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. దాంతో ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

పాలూ గుడ్డు కలిపి: మూడు చెంచాల యాపిల్‌ పేస్టులో చెంచా పాలు, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకు రాసి ఇరవై నిమిషాలపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఇలాచేస్తే తేడా మీకే తెలుస్తుంది.

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.