
క్రైమ్
రణస్థలం, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు సమయంలో ఒక వర్గం అభ్యర్థి 46 ఓట్లతో గెలిచినట్లు కేంద్రం నుంచి బయటకో వదంతి వచ్చింది. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో అభ్యర్థి అంతే మెజారిటీతో గెలుపొందారు. దీంతో గందరగోళమేర్పడి ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.