
ఆంధ్రప్రదేశ్
పోలవరం, న్యూస్టుడే: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ జాయింట్ ఎన్విరాన్మెంట్ కమిషనర్ సి.టి రాజేంద్రరెడ్డి, కేంద్ర పర్యావరణ బోర్డు సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మహిమ సోమవారం సాయంత్రం పరిశీలించారు. తొలుత వారు ఇటుకలకోట సమీపంలో కుడి కాలువపై నిర్మించిన డెలివరీ సిస్టమ్ వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని పంపుహౌస్ ఆకృతులను చూశారు. కుడికాలువ ఈఈ బి.ఏసుబాబు ఎత్తిపోతల పథకం గురించి వారికి వివరించారు. ఎన్జీటీ సభ్యులు మంగళవారం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు ఎస్ఈ కె.నరసింహమూర్తి, డీఈ వరప్రసాద్ ఉన్నారు.