
జాతీయ- అంతర్జాతీయ
శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలిగా జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం తిరిగి ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు ఆమె పదవిలో కొనసాగనున్నారు. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రజల వాణిని వినిపించేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు తమ పార్టీ ఏర్పాటయిందని మెహబూబా పేర్కొన్నారు.