
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరి, ఎస్.వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వర్రావు, మరో నేత వేం నరేందర్‌రెడ్డిలకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. 2005లో వరంగల్ సుబేదారి ఠాణా పరిధిలో తెదేపా ఆందోళన కార్యక్రమంపై నమోదైన కేసుకు సంబంధించి మార్చి 4న హాజరు కావాలని ఆదేశించింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు జీడిమెట్ల పోలీసుస్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు కోర్టు సమన్లు ఇచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.