
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: సామాన్య ప్రజలకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం ఎన్టీఆర్ భవన్లో తెదేపా రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగింది. పార్టీ నేతలు అరవిందకుమార్‌గౌడ్, కాశీనాథ్, సీతాదయాకర్‌రెడ్డి, అజ్మీరా రాజునాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.